back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsవరంగల్ రాజకీయాల్లో సంచలనం: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన

వరంగల్ రాజకీయాల్లో సంచలనం: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన

Aaruri Ramesh Resignation: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా – బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన

వరంగల్: వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. త్వరలోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

2024 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్‌కు పరాజయం ఎదురైంది. గతంలో ఆయన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్‌లో కొనసాగిన ఆరూరి రమేష్, గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావించి బీజేపీలో చేరారు. అయితే మోదీ చరిష్మా, బీజేపీ ఇమేజ్ ఉన్నప్పటికీ వరంగల్ ప్రజలు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరూరిపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందని చర్చ సాగుతోంది.

ఎమ్మెల్యేగా ఘన విజయాలు – ఆపై రాజకీయ పతనం

ఆరూరి రమేష్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి పొందాలని ఆశించారు. అయితే ఆయనపై, ఆయన అనుచరులపై పెరిగిన వ్యతిరేకత కారణంగా 19,458 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బీజేపీ వైపు మొగ్గుచూపారు. నాటకీయ పరిణామాల మధ్య 2024 మార్చి 17న బీజేపీలో చేరిన ఆయన, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, తొలిసారి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కావ్య చేతిలో ఓడిపోయారు.

ఈ పరాజయంతో పాటు బీజేపీలో ఆశించిన స్థాయి రాజకీయ ప్రాధాన్యం లభించకపోవడంతో తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరూరి రమేష్ తిరిగి గులాబీ గూటికి చేరడం వల్ల వరంగల్ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles