A Forms Submission: జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతంపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ A-ఫారాలను ఈరోజు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారితో కలిసి జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా అందజేశారు.
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ A-ఫారాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను గంభీరంగా తీసుకుంటూ, ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఎన్నికల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు అందించాలని కోరారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


