Congress 141st Foundation Day Telangana: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Congress 141st Foundation Day Telangana)ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి, అలాగే జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీ వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం గాంధీ భవన్ ప్రాంగణంలో పార్టీ జెండాను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, సెక్యులరిజం వంటి విలువలే కాంగ్రెస్ పార్టీ బలమని పేర్కొన్నారు.
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ విధానాలే పరిష్కారమని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


