250 square yards of land is in demand: కవిత కల్వకుంట్ల రాష్ట్రవ్యాప్త పోరాటానికి పిలుపు
కరీంనగర్: కరీంనగర్ గడ్డపై ప్రారంభమైన ప్రతి ఉద్యమం విజయవంతమైందని, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ఉద్యమ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ నుంచి ప్రారంభమైన ఈ పోరాటాన్ని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించి, ఉద్యమకారులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఎత్తిన పిడికిలిని దించేది లేదని, చివరి వరకూ పోరాడుతామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించడం న్యాయమైన డిమాండ్ అని, ఇది వారి గౌరవానికి సంబంధించిన అంశమని నేతలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ, న్యాయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


