JanaSena Student Wing:తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అడ్‌హాక్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అడ్‌హాక్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను విద్యార్థుల్లో బలంగా నాటడంతో పాటు, భవిష్యత్తులో పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేసే నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా మార్గనిర్దేశం చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి విభాగం కార్యకర్తలకు జనసేన పార్టీ కిట్‌ను అందజేశారు. శిక్షణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, విభాగాల పాత్ర, గ్రౌండ్ లెవల్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడం, విద్యార్థులు–ప్రజల మధ్య వారధిగా పనిచేయాల్సిన బాధ్యతలను వివరించారు.
పార్టీ ఆశయాలను కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యార్థి విభాగం పార్టీకి బలమైన పునాదిగా నిలవాలని నేతలు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసేవే జనసేన విద్యార్థి విభాగానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా తెలంగాణలో జనసేన పార్టీకి విద్యార్థి విభాగం కీలక బలంగా మారుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


