TGSRTC’s new plan: 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు… ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో TGSRTC కొత్త ప్రణాళిక
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తూ, నగర అంచుల్లో కొత్త కాలనీలు భారీ సంఖ్యలో ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో కొత్త ప్రత్యేక బస్సు (TGSRTC’s new plan) సర్వీసులను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద జీహెచ్ఎంసీ పరిధిలోని 373 కొత్త కాలనీలకు RTC బస్సు సౌకర్యం అందించనుంది.
ఈ నిర్ణయం RTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తీసుకున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ‘హైదరాబాద్ కనెక్ట్’ ప్రోగ్రామ్ రూపుదిద్దుకుంది.
కొత్త బస్సులు డిసెంబర్ నుంచే రోడ్డెక్కనుంది
TGSRTC ప్రకారం, ఈ కొత్త సర్వీసులు డిసెంబర్ నెల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ప్రధాన రూట్లను గుర్తించి, కొత్త కాలనీల నుంచి మెట్రో స్టేషన్లు, ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లు, ఐటీ కారిడార్, బిజినెస్ హబ్‌లకు బస్సులు నడపనున్నారు.
ఈ చర్య ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, రోజు వారీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా మెట్రో సరిహద్దుల్లో ఉన్న కొత్త ప్రాంతాల వారు RTC బస్సులను సులభంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
రవాణా సేవల విస్తరణ—ప్రజలకు పెద్ద ఊరట
ప్రస్తుతం నగర అంచుల్లో ఉన్న అనేక కొత్త కాలనీల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల ఖర్చు పెరగడమే కాక ట్రాఫిక్ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ‘హైదరాబాద్ కనెక్ట్’ కార్యక్రమం ఈ ఇబ్బందులను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
RTC అధికారుల ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్ నగర రవాణా వ్యవస్థను మరింత బలపరుస్తుందని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రయాణికుల స్పందనను బట్టి మరిన్ని కాలనీలకు బస్సు మార్గాలను విస్తరించేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉంది.
TGSRTC తీసుకున్న ఈ నిర్ణయం నగరవాసులకు పెద్ద ఆనందాన్ని కలిగించనుంది. 373 కొత్త కాలనీలకు RTC బస్సులు అందుబాటులోకి రావడం, ముఖ్యంగా ఉద్యోగులు మరియు రోజూ ప్రయాణించే వారికి పెద్ద ఉపశమనమే. రాబోయే రోజుల్లో ‘హైదరాబాద్ కనెక్ట్’ కార్యక్రమం హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత సమర్థవంతంగా మార్చనుంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


